Friday, October 19, 2007

This is not only a TV shows title, its every life partner's promise, to each other.


"నీలోసగం" అనగానే ఎవ్వరికైనా అర్ధమౌతుంది ఇది భార్యాభర్తలకు సంబంధించిన మాట అని. ఈ మాటని టైటిల్ గా వాడుతూత్వరలో జెమిని చానెల్ లోఒక టివి సీరియల్ టెలికాస్ట్ అవ్వబోతోంది . సీరియల్ మొదలు పెట్టిన తర్వాత కథా పరమైన చర్చలు జరుగుతున్నపుడునాకు ఒక అలోచన తట్టింది, "నీలోసగం" పేరుతో బ్లాగు ఎర్పాటు చెయ్యాలని. ఎందుకో మీకు అర్ధం కావాలంటే ముందుగా కొంత సీరియల్ కిసంబంధించిన కథ చెప్పాల్సిందే. ముగ్గురు స్నేహితురాళ్ళు కాలేజిలో చదివే రోజుల్లో కీసరగుట్ట మీద ఉన్న శివాలయంకి వెళతారు . అక్కడ కొండ మీద విసిరేసినట్టుగా పడి ఉన్న శివలింగాలను చూస్తూ, యుక్త వయసులో సహజంగా ఉండే నిర్లక్ష్య ధోరణితోశివుడిని సరదాగా విమర్శించారు, ఆయనకు ఇద్దరు భార్యలు అని, అసలు భార్యను పక్కన పెట్టి సవతిని నెత్తిన ఎక్కించుకున్నాడని, ఈవిధంగా.ఆ ప్రక్కనే ఉన్న ఒక సాధువు వీళ్ళ మాటలు విని గట్టిగా కోప్పడుతూ శివ తత్వాన్నితెలుసుకోలేని మూర్ఖులు మీరు, మీ విమర్శలకు ప్రతిఫలంగా మీజీవితాలు అస్థవ్యస్తమై పోతాయిగాక అంటూ శపించినట్టుగా అనేసి వెళ్ళిపోయాడు. మొదట్లో పెద్దగా పట్టించుకోని స్నేహితులు ఆ తర్వాత జరిగినపరిణామాలతో కంగారు పడ్డారు, భయపడ్డారు, మళ్ళీ ముగ్గురూ కలిసిసాధువుని వేడుకోవడానికి కీసరగుట్ట వెళ్ళారు . కానీ వాళ్ళకక్కడ ఎవ్వరూకనపడలేదు. కనీసం ఆ సాధువు వివరాలు కూడా తెలియలేదు. నిరాశతొ వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో చాలా విచిత్రంగాముగ్గురూ కూడా బాధలు పడ్డారు. అసలు ఏమిటి మనిషి నైజం? ఎందుకు ఎక్కువ మంది పరాయి స్త్రీ/పురుషుని వెంట పడుతున్నారు? పెళ్ళైన కొత్తలో నేను నీలోసగం నీవు నాలోసగంఅని నమ్మబలికిన వారు ఆ తర్వాత తర్వాత ఎందుకు అంటీ అంటనట్టుగా ప్రవర్తిస్తూ వేరొకరి వ్యామోహంతో జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నారు?ఎందుకు అచ్చం దేముడి కథల్లో చెప్పబడినట్టుగానే మనుషుల జీవితాల్లో కూడా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి? జీవితం అంటేజగన్నాటకమా? . . . . . . యాదృశ్చికమా? . . . . . భ్రమా? . . . . స్వప్నమా? . . . .ఏమో ఎవ్వరికీ ఏమీ తెలియదు. . . . . . . . ఐతే మనం నిజమని నమ్ముతున్న ఈ జీవితంలో, కష్టాలను మాత్రం మనమే స్వయంకృతంతో తెచ్చుకుంటున్నామనేది చాలా వరకూ ఒప్పుకోవాల్సిన సత్యం. కాదంటారా? ఔనంటారా? మీరేదైనా అనడం కోసమే ఈ వేదిక(http://neelosagam.blogspot.com/) కల్పించ బడింది. వైవాహిక బంధం గురించి, సహచరుల గురించి,నిర్మొహమాటంగా, నిర్భయంగా చర్చిద్దాం. భావి తరాలవారు ఈ జీవితానుభవాలను తెలుసుకొని, ఎంతో కొంత ఎక్కువ ఆనందాన్ని, సౌఖ్యాన్ని,అనుభవించేలా మన అనుభవాల్ని ఈ వేదికద్వారా టెలివిజన్ లో ప్రదర్శిద్దాం...................భవదీయుడు ..........సుధాకర రెడ్డి. సత్తి

3 comments:

శ్రీనివాస said...

"అసలు ఎమిటి మగవాడి నైజం? ఎందుకు ఎక్కువ మంది పరాయి స్త్రీల వెంట పడుతున్నారు?" - ఇలా మగజాతిని ఆడిపోసుకోవడం ఇప్పుడు ఫ్యాషనైపోయింది. మొగుడికి తెలియకుండా రంకు సాగిస్తున్న జాణలులేరా ఈ లోకంలో; వాళ్ళను ఉదహరించరేం... మీ టైటిల్ సూచించినట్టు ఇద్దరినీ (మగ/ఆడ) ఇతివృత్తంగా తీసుకుని కథను తయారుచేయండి.. ఇలా ఒక్కరినే పక్షపాత ధోరణిలో ఆడిపోస్తూ సానుభూతిని మూటకట్టుకోవాలని కంకణంకట్టుకోండి.

sudha said...

శ్రీనివాస్ గారు! నేను ఏఒక్కరి పక్షపాతిని కాదండి. రెండు చేతులు కలిస్తేనే చప్పుడు. ఆ సంగతి మరచిపోకండి. పులిని నాలుగు దుప్పులు కలసి చంపితే మనం చప్పట్లు కొడతాం,అంతే గాని పులి మీద జాలి పడం. మీకు అర్ధం అయ్యింది కదా సమాజం లో ఎవరిని పులితో సొదాహరించేనో. సీరియల్ మొదలవ్వనివ్వండి ఇంకా బాగా స్పందిందురుగాని.

Anonymous said...

>> మొగుడికి తెలియకుండా రంకు సాగిస్తున్న జాణలులేరా ఈ లోకంలో; వాళ్ళను ఉదహరించరేం...

శ్రీనివాస...బాలీవుడ్డులో, టాలీ, శాండల్, గీండల్వుడ్డులలో unfaithful స్పూర్తితో నిరంతరంగా వస్తున్న అక్రమసంబంధాల సినిమాలు చాల్లేదా? చూసి చూసి జనాలు కూడా విచక్షణ లేకుండా...ఆ ఏముందిలో ఇందులో చర్మాల ఒరిపిడే కదా అనే కాడికి వచ్చేశారు. ఇంకా వాటిని టీవీలల్లో కూడా ఉదహరించడం ఎందుకు? మనసుల్ని కలుషితం చెయ్యడానికి కాకుంటే.