నీలోసగం సీరియల్ ఇప్పటికి 27 భాగాలు జెమిని చానల్ లో మధ్యాన్హం 12 గం 30 ని.లకు ప్రదర్సించబడ్డాయి. చూసిన వాళ్ళు అద్భుతమైన సినిమాని చూసినట్టుగా ఉంది గాని ఒక సీరియల్ చూస్తున్నట్టు లేదు అని అంటున్నారు. ప్రేక్షకులకు నా కృతజ్ఞతాభివందనములు. ఇంత మంచి సీరియల్ ప్రైం టైం లో వస్తే బాగుండేది, ఎక్కువ మంది చూడలేక పోతున్నాము అంటున్నారు చాలామంది. ఈ విషయం జెమిని ఎం డి గారి దృస్టికి తీసుకెళ్ళడం జరిగింది. వీలైనంత త్వరలో వారు ఈ సీరియల్ ని సాయంత్రం అందరూ చూడగలిగే టైం లో వేస్తారు అని ఆశిద్దాం. . . . .. . .విధేయుడు. . . . .సుధాకర రెడ్డి. సత్తి
Saturday, February 16, 2008
Friday, November 16, 2007
అపార్ధం చేసుకోకండి.
పెద్దలందరికి నమస్కారములు. సినిమాకు సంబంధించిన వ్యక్తులంటే సమాజంలో ఎంత చులకనో నాకు తెలియంది కాదు. దయచేసి మీ సూటిపోటి మాటలు కాకుండా, నిజంగా సమాజపరంగా ఆరోగ్యకరమైన కథను చిన్న తెరమీద చెప్పాలనుకుంటున్న నాకు, పనికొచ్చే విషయాలను వెల్లడించగలరని ఆశిస్తునాను. సినిమా ప్రపంచంలో కుళ్ళు చూడలేక మీలాంటి మహానుభావులంతా కావాలని మాకు దూరమైపోయారని నా ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా చెప్పాలనుకున్నదేమిటంటే నేను ఎవరి పక్షపాతిని కాదు. నా బ్లాగులో ప్రచురించిన వ్యాసాన్ని సరిచేసాను, పరికించగలరు. ఏదో తొందరలో మరీ స్త్రీ పక్షపాతిని అని ధ్వనించేలా రాసేసాను, క్షంతవ్యుడిని. ఇలా కూడబలుక్కుంటూ ప్రతి అక్షరాన్ని టైప్ చేస్తూ నా పూర్తి భావప్రకటన వీలుకావడంలేదుగాని ఓసారి ఇ తెలుగు సమావేశానికి వస్తాన్లెండి మీ అందరి తిట్లు దీవెనలు అందుకోవడానికి. విధేయతతో .........సుధాకర రెడ్డి.
Posted by
sudha
at
9:12 AM
0
comments
Friday, October 19, 2007
This is not only a TV shows title, its every life partner's promise, to each other.
Posted by
sudha
at
10:16 PM
3
comments
